Geetha Koumudi-1    Chapters   

ద్వితీయ ముద్రణము

పీ ఠి క

ఈ గీతా కౌముది ప్రథమ భాగము ప్రథమ ముద్రణము 1000 కాపీలు అయిపోవుటచేత ద్వితీయ ముద్రణము చేయ నవసరము కలిగినది. రాజోలు తాలూకా లక్కవరం గ్రామకాపురస్తులును, ఆస్థికోత్తములును, దైవభక్తి సంపన్నులును, దాతలును, నిరుపమాన యోగ్యతకల ఐశ్వర్య వంతులును అగు మంగెన సత్యనారాయణమూర్తి, వేణు గోపాలం సోదరులతోను వీరి పెదతండ్రి గురవయ్యగారి కుమారుడు సత్యనారాయణమూర్తిగారితోను ద్వితీయ ముద్రణమును గురించి చెప్పగా వారు తమ సహజమైన ఔదార్యముతో ద్వితీయముద్రణమును తాము ఉచితముగ చేయించుటకు అంగీకరించి రాజమండ్రిలోని కొండపల్లివారి ముద్రాశాలలో అత్యల్పకాలములో 1000 ప్రతులును అచ్చువేయించిరి. ఇట్టి అమూల్య సహాయమును గావించిన శ్రీ మంగెన సత్యనారాయణమూర్తి సోదరులకును, మంగెన గురవయ్యగారి కుమారుడు సత్యనారాయణమూర్తిగారికిని సకల శ్రేయస్సులు కలుగుగాక అని మానారాయణస్మరణ పూర్వక ఆశీస్సులు.

విద్యాశంకరభారతీస్వామి

శ్రీ గాయత్రీ పీఠము,

శంకరమఠము

బందరు, (కృష్ణాజిల్లా)

సౌమ్యవత్సర శంకరజయంతి

తే 21-4-1969.

Geetha Koumudi-1    Chapters